Natyam ad

హత్యకేసులో నలుగురు అరెస్టు

చంద్రగిరి ముచ్చట్లు:


ఈనెల 1వ తేదీన జరిగిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నాగరాజు హత్య కేసును చంద్రగిరి పోలీసులు చేధించారు. చలనం సృష్టించిన ఈ కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు అయ్యారు.
నిందితులు నాగరాజును హత్య చేసి కారు ముందు సీట్లో ఉంచి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఏ 1 నిందితుడు రిపుంజయ భార్యతో నాగరాజు తమ్ముడు పురుషోత్తం కు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణమని అడిషనల్ ఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. ఈ కేసులో ఏ1  రిపుంజయ, ఏ2 చానుఖ్య ప్రతాప్, ఏ3 గోపీనాథ్, ఏ4 రమేష్, ఏ5 కుమార్ లు.
అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ చాణక్య ప్రతాప్ అరెస్టుకు చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం. గురువారం సాయంత్రం రేకల చెరువు అనుపల్లె వద్ద ముద్దాయిలను అరెస్టు చేసాం. నిందితులపై  రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నాం. వీరంతా పథకం ప్రకారము హత్య చేశారు. హత్య స్థలంలో ఒకవాహనం దహనం కాగా మరో మూడు వాహనాలు హత్యకు ఉపయోగించారు. మృతుడు నాగరాజు రిపుంజయ మధ్య ఫోన్ సంభాషణలో గొడవ పడ్డ ఆడియో టేప్ సేకరించాం. హత్య చేసి తగలబెట్టి ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పటికే నలుగులు నిందితులను అరెస్ట్ చేశాం, ఏ2 చాణఖ్య ప్రతాప్ పరారిలో ఉన్నాడని అన్నారు.

 

Tags; Four arrested in murder case

Post Midle
Post Midle