Natyam ad

నాటుసారా వ్యాపారంలో నలుగురు అరెస్ట్..

సామర్లకోట ముచ్చట్లు:

మండల పరిధిలో నాటుసారా, అక్రమ మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న నలుగురిని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు.కాకినాడ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో తెల్లవారు జాము నుంచి విస్తృత దాడులు నిర్వహించారు.అనంతరం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఇటీవల కాకినాడ జిల్లా పరిధిలోని ఎక్సైజ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తమ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ సంయుక్త సంచాలకులు ప్రేమ్ ఖాజాల్ జరిపిన సమీక్షలో సామర్లకోట మండల పరిధిలో నాటుసారా వ్యాపారాలు అధికంగా ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్న తమ దృష్టికి ఉన్నతాధికారులు తీసుకు వచ్చారన్నారు.

Post Midle

దానితో ఈరోజు తెల్లవారు జాము నుంచి దాడులు చేపట్టామన్నారు.

దానిలో సామర్లకోట మండలం మాధవ పట్టణం గ్రామంలో రెడ్డి బేబీ, వికే రాయపూరం గ్రామంలో బత్తుల చక్రం, సామర్లకోట పట్టణం కుమ్మరవీది కి చెందిన సాయిబాబు లను సారా విక్రయిస్తుండగా ఒక్కొక్కరి వద్ద నుంచి 5 లీటర్లు చొప్పున సారాతో అరెస్టు చేసినట్టు చెప్పారు.అలాగే సామర్లకోట పట్టణం లోని మఠం సెంటర్లో ప్రభుత్వ మద్యం షాపులు తెరవక ముందే తెల్లవారు జాము నుంచే మద్యం విక్రయిస్తున్న నొక్కుల్ల నరసింహ మూర్తి ని అరెస్టు చేసినట్టు చెప్పారు.వీరిని తదుపరి చర్యలు నిమిత్తం కాకినాడ ఎక్సైజ్ నార్త్ స్టేషన్ కు అప్పగిస్తున్నట్టు చెప్పారు.కాగా ఈ దాడులు సంక్రాంతి పండుగ వరకు కొనసాగించి సారా రహిత సామర్లకోట గా తీర్చి దిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు చెప్పారు.

 

Tags: Four arrested in Natusara business..

Post Midle