ప్రొద్దుటూరు అత్యాచార కేసులో నలుగురు ఆరెస్టు

కడప ముచ్చట్లు:

ప్రొద్దుటూరు అత్యాచార కేసుపై జిల్లా ఎస్పీ అన్బు రాజన్  మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఎస్పీ మాట్లాడుతూ మైనర్ బాలికపై ఆత్యాచారం ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశాం. అంగన్వాడీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసాం. వెంటనే ప్రొద్దుటూరు పోలీసులు  స్పందించి  కేసు నమోదు చేశారు.  కేసు నమోదు చేయలేదని మీడియా లో వచ్చిన వార్తలు అవాస్తవం. ఈ నెల 8 వ తేదీన ప్రొద్దుటూరు రురల్ పోలీసులు బాలికను డాడి హోమ్ కు తరలించి విచారణ మొదలు పెట్టారు. బాలిక వద్ద 164 స్టేట్ మెంట్ నమోదు చేయడానికి ప్రొద్దుటూరు కోర్టులో హాజరు పెట్టనున్నాము. మతిస్థిమితం లేక బిక్ష మెత్తుకునే బాలికను మాయమాటలు చెప్పి మోసం చేశారని అన్నారు.
ఇంట్లో పని కోసం అని తీసుకు వెళ్లి బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి ని కూడా అరెస్టు చేశాం. ఆమె ప్రియుడు అని చెబుతున్న శంభు ను కూడా అరెస్టు చేశాం. కేసునమోదు చేయడం లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. నిందితులపై పొక్సో యాక్ట్ క్రింద కేసులు నమోదు చేసాం. మహిళలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Post Midle

Tags: Four arrested in Proddatur rape case

Post Midle
Natyam ad