రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్లు, బస్సు ఢీ
పలువురికి గాయాలు
భువనగిరి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న డిసిఎం సడెన్ బ్రేక్ వేయడంతో నాలుగు కార్లు, బస్సు ఢీకొన్నాయి. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Tags: Four cars and a bus collided in a road accident
