ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు

Date:16/04/2018
నిజామాబాద్  ముచ్చట్లు:
ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందో త్లలి. ఈ అరుదైన సంఘటన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నసురుల్లా బాద్ మండలం హజీ పూర్ తాండాకు చెందిన శోభ సోమవారం  ఉదయం డెలివరి నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే  ఉదయం 11 గంటల సమయంలో శోభ పండంటి నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా వుందని మరో ముగ్గురి బరువు తక్కువగా వుందని డాక్టర్లు తెలిపారు. అవసరమైతే వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలిస్తామనని తెలిపారు.  శోభకు నార్మల్ డెలివరి కావటం విశేషం.
Tags:Four children in one part

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *