నాలుగు రోజుల పాటు మద్యం షాపులు బంద్ 

Four days alcohol shops bandh

Four days alcohol shops bandh

ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఇక్కట్లు
Date:10/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు షాపులు బంద్. ఓట్ల లెక్కింపు జరిగే 11వ తేదీన కూడా మూతపడనున్న షాపులు.ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఎన్నికలు జరిగే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా… 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూత పడనున్నాయి. అదే విధంగా 11వ తేదీన కూడా షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Tags; Four days alcohol shops bandh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *