Natyam ad

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

అదిలాబాద్ ముచ్చట్లు:


ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందారు. తాంసి మండలంలోని హస్నాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదాన్ని గమనించి గాయపడిన వారిని అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడగా.. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని కిన్వట్ – ఆంద్ బోరి నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బైక్ ను తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇచ్చోడ మండలం కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన మనీషా(15), సంస్కార్ (11), వీరి తండ్రి మారుతి (40) మృతి చెందారు. తల్లి వందనకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోగా, మరొకరు మృత్యువుతో  పోరాడుతున్నారు. దీంతో అశోక్ నగర్ లో విషాదం అలుముకుంది. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు.

 

Tags: Four died in a road accident

Post Midle
Post Midle