నల్లగొండలో నాలుగున్నర లక్షల మంది రైతులు

Date:17/04/2018
నల్లగొండ ముచ్చట్లు:
నల్లగొండ  జిల్లా వ్యాప్తంగా 31మండలాల్లో మొత్తం 4,44,890 మంది రైతులు 11,86,459 ఎకరాల భూమిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు.ఈనెల 20 నుంచి రైతులకు నేరుగా వారి పేరిట చెక్కుల పంపిణీ ప్రారంభిం చనున్న ప్రభుత్వం.. నెల రోజుల్లోనే మూడు దఫాలుగా ప్రతి రైతుకూ సాయం అందించేందుకు ఏర్పాట్లు చేపడు తోంది. ఇప్పటికే చెక్కుల పంపిణీ తేదీలను సైతం నిర్ణయిం చిన యంత్రాంగం త్వరలోనే వాటిని అధికారికంగా ప్రక టించే అవకాశం ఉంది జిల్లా యంత్రాంగం వీళ్లందరికీ ప్రతి ఏటా రెండు పంటలకు ప్రభుత్వ సాయం అందించాలని నివేదించింది.వానాకాలం పంట సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేల కోట్లు రాష్ట్రవ్యాప్త సాయం విడుదల చేసింది. మొత్తం మూడు దఫాలుగా జిల్లాకు అవసరమైన నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటికే తొలి దఫాలో భాగంగా రూ.117.78కోట్లు విడుదలయ్యాయి. వీటిని 173గ్రామాల్లోని 1,10,828మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. మిగిలిన రైతులకు మరో రెండు దఫాలుగా నిధులు విడుదల కానున్నాయి దీని ప్రకారం ఏటా ఎకరాకు రెండు పంటలకు కలుపుకొని రూ.8వేలు రైతులకు అందనున్నది. మొత్తంగా ఏటా రూ. 949.16కోట్లు పంట సాయం రూపంలో రైతులకు ప్రభు త్వం అందజేయనున్నది. ఇందులో భాగంగా తొలి సారి రానున్న వానాకాలం సాగుకోసం ఈ నెల 20నుంచి ఎకరా కు రూ.4వేల సాయం పంపిణీ ప్రారంభం కానున్నది. ముందుగానే రైతులకు సమాచారం అందజేసి ఆ తర్వాతే ఆయా గ్రామాల వారీగా చెక్కుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఎవరైనా రైతుకు 12ఎకరాలకు మించి భూమి ఉన్న సందర్భంలో రూ.50వేలకు మించి సాయం అందించాల్సి ఉన్నందున రెండు చెక్కులను రూపొందించే అవకాశం ఉంది.
Tags: Four lakhs of farmers in Nallagonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *