పిడుగు పడి  నలుగురు మృతి

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో విషాదం నెలకొంది.  జామాయిల్  కర్రలు తొలగిస్తున్న   కూలీలపై పిడుగు పడింది. ఘటనలో నలుగురు మృతి చెందగా  పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని  చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జామయిల్ తోటలో కూలి పనికి 30 మంది వచ్చారు. వారిలో ఏడుమంది పిడుగు పాటుకు గురయ్యారు.  బుధవారం తెల్లవారుజామున ఘటన జరిగింది.  ఆర్ రాజు30, వి ధర్మరాజు26 జి కొండబాబు 32 కే శ్రీనివాస్20 లు ఘటనా స్థలంలోనే మృతి చెందగా కే గణేష్ ,ఎస్ వెంకట స్వామి, ఎస్ అర్జున్ ,లు తీవ్ర గాయాల పాలయ్యారు.తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగానే ఉంది ఈ ఘటనతో మిగిలిన కూలీలు ఆందోళనలో ఉన్నా వీరంతా కాకినాడ జిల్లాకు చెందినవారు.

 

Tags: Four people died due to lightning

Leave A Reply

Your email address will not be published.