Four people were injured in the clash between the two sides

ఇరువర్గాల ఘర్షణ నలుగురికి గాయాలు

Date:17/09/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఆవుపొలంలో దూరి పంటను తినేసిందన్న కోపంతో ఇరువర్గాలు ఘర్షణ పడటంతో నలుగురు గాయపడి , ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన గురువారం రాత్రి జరిగింది. మండలంలోని భరిణేపల్లెకి చెందిన హేమాద్రి తిరుపతిలో పోలీస్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఉండగా హేమాద్రి చిన్నాన్న బాలాజి ఆవు తన పొలంలో మేసిందని సాయంత్రం ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. దీనిపై బాలాజి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పినా హేమాద్రి వినకుండ బాలాజి ఇంటి వద్దకు వెళ్లి అతనిని కొడవలితో నరకడంతో ఎడమచెయ్యి, కాలు, శరీరంపై తీవ్ర గాయాలైందని, అలాగే బాలాజి తల్లి మునెమ్మకు గాయాలైందని బాధితుడు తెలిపాడు. కానిస్టేబుల్‌ హేమాద్రి మాట్లాడుతూ తనపై బాలాజి, వారి కుటుంబ సభ్యులు తనపై దాడి చేసేందుకు వచ్చి ఆఘర్షణలో బాలాజి గాయపడ్డాడని, తన తల్లినారాయణమ్మను, తనను గాయపరిచారని తెలిపాడు. ఈ మేరకు ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు ఇరువర్గాల వాగ్మూలం నమోదు చేస్తున్నామని ,విచారించి, కేసు నమోదు చేస్తామని తెలిపారు.

హుండీలో భారీగా రద్దైన నోట్లు

Tags: Four people were injured in the clash between the two sides

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *