కడప ముచ్చట్లు:
కడప జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసారు. వారి నుంచి 15 ఎర్రచందనం దుంగలు, ఒక కారు రూ. 40 వేలు నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ వెల్లడించారు.ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు.. స్మగ్లర్లపై పి.డి యాక్ట్ ప్రయోగిస్తామని అయన హెచ్చరించారు. స్మగ్లర్లను అరెస్టు చేసి ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన జమ్మలమడుగు డి.ఎస్.పి నాగరాజు, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, జమ్మలమడుగు రూరల్ సి.ఐ వెంకట కొండారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, సత్యబాబు, మైలవరం ఎస్.ఐ రామకృష్ణ, సిబ్బందిని జిల్లా ఎస్.పి అభినందించారు.
Tags: Four red sandalwood smugglers arrested…