Natyam ad

వాగులో కొట్టుకుపోయిన నలుగురు స్టూడెంట్స్

కర్నూలు ముచ్చట్లు:


గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం రాయపాడు నుంచి గగ్గటూరు బ్రిడ్జి దాటుతున్న క్రమంలో కారు వాగులో కొట్టుకుపోయింది.
కర్నూలు నగరానికి చెందిన నలుగురు మిత్రులు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం కోసం మిత్రులు కారులో ప్రయాణిస్తున్నారు. వాగు దాటుతున్న క్రమంలో కారు కొట్టుకుపోతుండడంతో స్థానికులు గమనించి నలుగురిని రక్షించే ప్రయత్నం చేశారు. కారును గమనించి అద్దాలు పగలగొట్టి నలుగురిని బయటికి తీసిలోపు ఒక్కరు అప్పటికే మరణించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ చూసినా వాగులు, వంకలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులను ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయొద్దని అంటున్నారు.

 

Tags: Four students were washed away in the river

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.