ఎన్ ఆర్ ఐ నంటూ మోసం

గుంటూరు ముచ్చట్లు:

 

ప్రవాసాంధ్రుడినంటూ ఆన్‌లైన్‌లో యువతిని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నిండా ముంచాడు. ఏడు వారాల నగలు కానుకగా పంపిస్తున్నట్లు నమ్మించి ఆమె వద్ద రూ.2.25 లక్షలు కాజేసి చివరికి మోసం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాబాపట్ల మండలం నందిరాజుతోట పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి ఓ వివాహ వెబ్‌సైట్లో పాల్‌ మాణిక్‌(కేరళ) అనే వ్యక్తి ఫొటోలు పంపించాడు.ఇద్దరూ ఫొటోలు చూసుకుని ఒకరికొకరు నచ్చడంతో కొన్ని రోజులు మాట్లాడుకున్నారు. తాను యూకేలో పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. పెద్దలతో మాట్లాడి వివాహం నిశ్చయించక ముందే అత్తగారు ఇచ్చిన ఏడు వారాల నగలను బ్రిటన్‌ నుంచి పెళ్లి కానుకగా పంపిస్తున్నట్లు యువతికి తెలిపాడు. నగలు ఢిల్లీకి వచ్చాయని, కస్టమ్స్‌ సుంకం చెల్లించాలంటూ వేరే వ్యక్తులతో ఫోన్‌ చేయించి ఆన్‌లైన్లో మూడు విడతలుగా రూ.2.25 లక్షల నగదు వసూలు చేయించాడు.అతడి మాటలను అమాయకంగా నమ్మేసిన యువతి ఇంట్లో పెద్దలకు తెలియకుండా స్నేహితుల వద్ద అప్పుగా తీసుకొని నగదు చెల్లించింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అవతలి నుంచి స్పందన లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సోమవారం బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Fraud like NRI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *