కాకినాడ ముచ్చట్లు:
పెళ్లి పేరుతో మోసం చేసిన ఆరుగురిపై కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివ రాల ప్రకారం.. పెదమార్కెట్కు చెందిన టి. కృష్ణమోహనక్కు పెళ్లి సంబంధం చూస్తానని శిరీష అనే మహిళ కలిశారు. ఆమె ఈ ఏడాది జూన్ 23న సత్య వేణి, దుర్గ అనే ఇద్దరిని మధ్యవర్తులుగా పరిచయం చేశారు. అదే రోజు ఆయనను వారు రాజమహేంద్రవరం శివారులోని నామవరం తీసుకెళ్లి నీరజ అనే మహిళను పెండ్లి కుమార్తెగా చూపించారు. ఆమెకు తల్లిగా సత్యదేవి, అత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసు కోవాలని నిర్ణయించి అతడు ఖర్చుల నిమిత్తం రూ.2.80 లక్షలు, ఓ చర వాణి, బంగారు గొలుసు సత్యదేవి, ప్రియాదేవికి అందజేశాడు. కొద్దిరోజులకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. వారంతా మోసగత్తెలని తేలింది. నీర జకు అప్పటికే పెళ్లయి సంతానం ఉన్నట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు. మేరకు పోలీసులు ఆర మోరు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Fraud of women in the name of marriage and get money and jewelry by pretending to be a bride.