Natyam ad

రెండు వేల రూపాయల రద్దుపై మోసం

విశాఖపట్నం ముచ్చట్లు;


2వేల రూపాయల నోట్లు రద్దును క్యాష్ చేసుకునేందుకు ముఠాలు రంగంలోకి దిగాయి.నోట్లు మార్పిడి చేస్తే కమీషన్ వస్తుందని ఆశ చూపించి మోసం చేసిన గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు.విశాఖ నగరంలో 2 వేల నోట్ల మార్పిడి పేరిట 60 లక్షలతో ఉడాయిం చిన గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశా రు.విశాఖకు చెందిన ధర్మరాజు అనే వ్యక్తి 90 లక్షల విలువైన 500 నోట్లు ఇస్తే.. కోటి విలువైన 2 వేల నోట్లు ఇస్తామంటూ తనకు తెలిసిన వారిని నమ్మించాడు. విషయం తెలుసుకున్న భీమిలికి చెందిన ఎం.రామారావు అనే వ్యక్తి తన స్నేహితుల ద్వారా విజయ వాడ నుంచి 90 లక్షల విలువైన 500 నోట్లు తెప్పించారు.వాటిని భీమిలికి చెందిన కొయ్య అప్పలరెడ్డి సహాయం తో గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ వద్దకు వెళ్లి.. అప్పటికే అక్కడకు చేరుకున్న ధర్మరాజు, అతని స్నేహితు లు కాకినాడకు చెందిన ఎండీ అహ్మద్, సునీల్ అలియాస్ చిన్నాను కలిశారు. నగదు మారుస్తామని చెప్పిన ధర్మరా జు, అతని స్నేహితులు అహ్మద్, సునీల్ కలిసి రామారావు నుంచి 60 లక్షలు తీసుకుని మోటార్ సైకిల్పై ఉడాయించారు.వారి కోసం వెతికినా కనిపించకపోవడం, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి రామారావు టూటౌన్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలోనే ధర్మరాజుతో పాటు అతని గ్యాంగ్ను అదుపులోకి తీసుకుని 60 లక్షలు రికవరీ చేశారు.

 

Tags: Fraud on cancellation of two thousand rupees