ఆన్ లైన్ లో మోసం

Fraud online

Fraud online

నాలుగు వేల రూపాయల ఫోన్ ఆర్డర్ చేస్తే పది రూపాయల సబ్బును పంపించిన వైనం

Date:03/12/2019

భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:

ఆన్ లైన్ న్ షాపింగ్ లో నాలుగు వేల రూపాయల ఫోన్ ఆర్డర్ చేస్తే పది రూపాయల సబ్బును పంపించిన వైనం కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ సెంటర్ లో రామకృష్ణ మెడికల్ షాపు నిర్వహిస్తున్నల రాజు  నవంబర్ 29వ తారీఖున నాలుగు వేల రూపాయల ఖరీదు గల మొబైల్ ఫోను ని ఉదాన్ యాప్ ద్వారా బుక్ చేసాడు. ఈ నెల రెండవ తారీకున కంపెనీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ షాపు కు వచ్చి ఆర్డర్ ప్యాక్ ను రాజు కు ఇచ్చాడు. అదే సమయంలో రాజు డెలివరీ ప్రతినిధుల ముందు ఓపెన్ చేసాడు. అయితే అందులో మొబైల్ ఫోను స్థానంలో పది రూపాయల విలువ గల ఒక డిటర్జెంట్ సోప్ దర్శనం ఇచ్చింది. అవాక్కయిన మెడికల్ షాపు యజమాని ప్రతినిధులకు చూపించగా వారు కూడా నిర్ఘాంతపోయి, ఇది మధ్యలో ఎవరో చేసిన పొరపాటని, కంపెనీ తప్పిదం కాదని మీకు తొందర్లోనే మీరు చెప్పిన ఆర్డర్ పంపిస్తామని నచ్చచెప్పి వెళ్లిపోయారు. రాజు మీడియాతో మాట్లాడుతూ ఇలా జరగడం చాలా దురదృష్టకరమని, ఆన్ లైన్ కంపెనీలు వినియోగదారుడికి చేరే వరకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసాడు.

 

నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ సినిమా `ట‌క్ జ‌గ‌దీష్‌`

 

Tags:Fraud online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *