బోయకొండలో ఉచిత అన్న ప్రసాదం కేంద్రం ప్రారంభం
– భక్తులకు సౌకర్యంగా మరిన్ని సదుపాయాలపై దృష్టి
-మంత్రి పెద్దిరెడ్డి అండతో మరింత అభివృద్దే ధ్యేయం
చౌడేపల్లె ముచ్చట్లు:

బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహ్గత్సవాలను పురస్కరించుకొని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలమేరకు ఉభయదారులు, భక్తులకు సౌకర్యంగా ఆలయం వద్ద ఉచిత అన్నప్రసాదం కేంద్రంను ఏర్పాటుచేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజ రెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ ఈఓ చంద్రమౌళితోపాటు పాలక మండళి సభ్యులతో కలిసి అన్నప్రసాదం కేంద్రంను చైర్మన్ ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సంధర్భంగా చైర్మన్ మాట్లాడుతూ బోయకొండలో తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా దసరా మహ్గత్సవాలను నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మ్యిధున్‌రెడ్డి్య ధ్వర్యంలో , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డిల సూచనలమేరకు బోయకొండను మరింత అభివృద్ది చేయడమే ధ్యేయంగా పాలన సాగిస్తామన్నారు. సిబ్బంది భక్తుల పట్ల స్నేహపూర్వకంగా మెలిగి సులభ తరంగా అమ్మవారి దర్శన సేవలతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించేలా చూస్తామన్నారు.ఈ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర పాలక మండళి సభ్యుడు ఏ. రాజేష్, తదిత రులున్నారు.
చైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించిన నాగరాజరెడ్డి…….
బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద గల అడ్మినిస్టేషన్ భవన సముదాయంలో చైర్మన్‌గా నాగరాజరెడ్డి భాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన్ను పలువురు ప్రజాప్రతినిధులు సన్మానించి అభినందనలు తెలిపారు.
Tags: Free Anna Prasadam Center started in Boyakonda
