Natyam ad

ప్రాణం మీదకు వస్తున్న ఉచిత హామీలు

బెంగళూరు ముచ్చట్లు:

 

కర్ణాటకలో భ్రమలు వీడుతున్నాయి. ఉచిత హామీలు అమలు చేయడం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. అటు వందలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సైతం ఓకింత ఆందోళన పడుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఉచిత హామీలే ఇప్పుడు.. అటు ప్రభుత్వానికి.. ఇటు ప్రజలకు శాపంగా మారుతున్నాయి. ఈ తరుణంలో అక్కడ అరాచకం చోటుచేసుకుంటుంది. అందుకు యంత్రాంగం మూల్యం చెల్లించుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు.. తమ ఆదాయానికి గండి కొడుతున్నారని అధికారులపై ప్రజా ప్రతినిధులు, వ్యాపారులు కోపం పెంచుకుంటున్నారు. తాజాగా ఇటువంటి కారణాలతోనే ఓ మహిళా అధికారి దారుణ హత్యకు గురి కావడం విశేషం.కర్ణాటకలో ఐదు గ్యారంటీల పథకం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీ ల పథకం అమలు చేయాలంటే కత్తి మీద సాములా మారుతుంది. నెలకు 1600 సంపాదించినా పెన్షన్ కట్ చేస్తున్నారు. బ్యాంకులో పదివేల రూపాయల బ్యాలెన్స్ ఉన్నా పెన్షన్ వర్తించదు. వితంతువుకు ఇచ్చేది కేవలం 600 రూపాయలే. అయితే ఆమె నెల ఆదాయం 10000 దాటితే పెన్షన్ నిలిపి వేస్తున్నారు. ఇక వైకల్యాన్ని బట్టి దివ్యాంగులకు పెన్షన్ అందిస్తున్నారు. ఏడున్నర లక్షల మందికి పెన్షన్ వివిధ కారణాలతో నిలిపివేశారు. గృహలక్ష్మి పథకం సైతం సక్రమంగా అమలు కావడం లేదు.దీంతో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న వారికి నిరాశే ఎదురవుతోంది. ఏడాది తిరగకముందే ఆ పార్టీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది.బిజెపి అవినీతిపై పోరాటం చేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందుకే అవినీతి లేని పాలన అందించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యంత్రాంగానికి కొన్ని అధికారాలను కట్టబెట్టింది. మద్యం, మట్టి, ఇసుక వంటి విషయంలో పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ తరుణంలో యంత్రాంగం పట్టు బిగిస్తోంది.

 

 

 

ముఖ్యంగా అవినీతి మరక అంట కూడదన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా సీఎం సిద్ధరామయ్య దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ తరుణంలో సొంత పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ నేతలకు ఈ నిర్ణయాలేవీ మింగుడు పడడం లేదు. ఒకవైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు ప్రజాప్రతినిధుల నిస్సహాయత అరాచకానికి దారితీస్తోంది.కర్ణాటకలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరు నగర జిల్లా హుణాసే మారేనా హళ్లి గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కేఎస్ ప్రతిమ ను కొందరు దుండగులు హత్య చేశారు. ఆమె తన పరిధిలోని అనుమతులు లేని గనుల తవ్వకాలను నిలిపివేశారు. అందుకే హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టిన చర్యలు తీసుకోవడం వల్లే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి తాము అధికారంలోకి రావాలన్న ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన ఉచిత హామీలు కర్ణాటకలో అరాచకానికి కారణం కావడం విశేషం. మున్ముందు ఇటువంటి ఘాతుకాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

 

Post Midle

Tags: Free assurances coming to life

Post Midle