– టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమంను ప్రారంబించిన జిల్లా యస్.పి యల్. సుబ్బరాయుడు ఐ.పి.యస్.
– క్యాన్సర్ అంటురోగం కాదు, ఆరోగ్య సమస్యలు మొదటి దశలోనే గుర్తించాలి.
– ఇప్పటి పరిస్థితుల్లో వయసు నిమిత్తం లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తోంది. అలసత్వం వహించకుండా కాపాడుకోవాలి.
– జిల్లా పోలీస్ సిబ్బంది అందరు తప్పనిసరిగా తరచు విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
– ఆరోగ్యకరమైన జీవన శైలి క్రమబద్దమైన వ్యాయామం అవలంబించుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
-జిల్లా యస్.పి యల్. సుబ్బారాయుడు, ఐ.పి.యస్.
తిరుపతి ముచ్చట్లు:
జిల్లా యస్.పి యల్. సుబ్బరాయుడు, ఐ.పి.యస్ మాట్లాడుతూ నేటి సమాజంలో పని ఒత్తిడి, కల్తీ ఆహారం, దురలవాటు వలన వయసు నిమిత్తం లేకుండా క్యాన్సర్ కు గురి అవుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధికి గురి అవుతున్నారు. సాదారణంగా పని ఒత్తిడి వలన వారి వారి ఆరోగ్యం పైన శ్రద్ద తీసుకోక పోవడం ఒక కారణం. ఎన్ని పనులున్నా మనకోసం మన ఆరోగ్యం కోసం సమయాన్ని కల్పించుకొని వైద్య పరిక్షలు చేసుకోవాలి. ముందే తెలుసుకోవడం వల్ల వ్యాధిని నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.సమస్యలు వచ్చినప్పుడు వాటిని వెంటనే పరీక్షించుకోకుండా కాలయాపన చేయడం వల్ల వ్యాది పెద్దదై ప్రమాదం అంచులకు వెళ్ళే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఏ వ్యాధి నైనా ముందే గుర్తిస్తే వాటిని పూర్తిగా నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. క్యాన్సర్ రోగం అనేటి అంటురోగం కాదు, క్యాన్సర్ చికిత్స ఇప్పుడు సులబతరం వ్యాది యొక రకం, దశ దాని స్థానం గుర్తిస్తే సాదారణ చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. క్యాన్సర్ లను నివారించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి క్రమబద్దమైన వ్యాయామం అవలంబించుకోవాలి. దీని ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మన పోలీస్ కుటుంబ సభ్యులందరూ ఇలాంటి మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటె పరిష్కరించుకోవాలి అన్నారు. విమలకుమారి అడిషనల్ యస్.పి క్రైమ్ మాట్లాడుతూ అందరు ఆరోగ్యదాయకంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో అలాగే ఎక్కువ మంది మహిళా సిబ్బంది తనకు తెలియని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో వారిని గుర్తించి తదుపతి మెరుగైన వైద్య సేవలు అందించాలనే కృత నిచ్చయంతో ఈ వైద్య శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మహిళా వారి ఉద్యోగ భాధ్యతో పాటు వారి కుటుంబ సబ్యులు, వారి రక్త సంబంధికుల గురించి ఆలోచిస్తారని, వారి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని గురించి పట్టించుకోరని, ఈ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలీస్ యూనిట్ డాక్టర్ మాదూరి మేడం గారు మాట్లాడుతూ టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ కు సంబంధించి, సాధారణంగా మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల క్యాన్సర్ సంబంధించి మామోగ్రఫీ స్క్రీనింగ్ టెస్ట్ లు ఇక్కడ ఉచితంగా నిర్వహించడం జరిగింది. పోలీసు కుటుంబాలకు చెందిన మహిళలందరికీ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని విజయవంతం చేసినందుకు ఇక్కడకు వచ్చిన అందరికి దాన్యవదాలు తెలుపుకున్నారు.జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీస్ సిబ్బందికి మరియు పోలీస్ కుటుంబ సభ్యులకు పోలీస్ గ్రౌండ్ నందు నోటి ద్వారా వచ్చు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు సంబందించిన పరీక్షిలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి సుమారు 204 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి లు వెంకట్రావు అడ్మిన్ , విమలకుమారి క్రైమ్ వారు, డి.శ్రీనివాస రావు ఏ.ఆర్ వారు, డి.యస్.పి లు రవికుమార్, రవీంద్ర రెడ్డి, ఆర్.ఐ లు పోలీస్ యూనిట్ డాక్టర్ మధూరి, పి.వి.హేమంత్ కుమార్ పోర్గ్రాం మేనేజర్, వి.వెంకయ్య బాబు డెంటిస్ట్, కే.మహేంద్ర డి.ఈ.ఓ, వి.రెడ్డి కుమారు పి.సి, పి.మేహతాజ్ నర్స్, బి.అమరావతి నర్స్ మరియు మహిళా పోలీస్, పోలీస్ కుటుంబ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోమ శేఖర్ వారు పాల్గొన్నారు.
Tags:Free cancer awareness for women police personnel and family members