Free darshans at Boyakonda from 28th

28నుంచి బోయకొండలో ఉచిత దర్శనాలు

– కోవిడ్‌కారణంగా నిలివేసిన దర్శనాలను కొనసాగింపు
– భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్న ఈఓ

Date:28/10/2020

చౌడే పల్లె ముచ్చట్లు:

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నుంచి ఉచిత దర్శనాలకు అనుమతిస్తున్నట్లు బోయకొండ ఈఓ చంద్రమౌళి బుధవారం తెలిపారు. తెలుగుముచ్చట్లు వెబ్‌ నందు ఉచిత దర్శనాలు లేకపోవడంపై భక్తులు ఆగ్రహం శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలమేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సూచనలమేరకు బోయకొండలో ఉచిత దర్శనాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌-19 కారణంగా ఉచిత దర్శనాలను బ్రేక్‌ వేశామని, నేటినుంచి గతంలో లాగా భక్తులకు ఉచిత దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఈఓ తెలిపారు. భక్తులనుంచి దుఖాణదారులు అధిక ధరలకు తినుబండారాలు, పూజా సామాగ్రి విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాధుల మేరకు దుఖాణ యజమానులతో స్రమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంఆర్పీ రేట్ల కంటే అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఉచిత దర్శనాలు పొందే అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.

నవంబర్ 26 వ తారీఖు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి .

Tags: Free darshans at Boyakonda from 28th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *