Natyam ad

ఉచిత విద్యుత్ పథకం ఎత్తి వేతకే  మోటర్లకు  మీటర్లు

కడప ముచ్చట్లు:


వ్యవసాయ రంగానికి నాణ్యమైనవిద్యుత్తుసరఫరాచేయడానికి ,విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని వైకాపా ప్రభుత్వం చెప్పడం పచ్చి మోసం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు.బుధవారం  కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ  జిల్లా కార్యాలయం ఇందిరా భవన్ లో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే కల్లు కోసం కాదు, దూడ గడ్డి కోసం అన్నట్లు జగన్ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేసి తద్వారా ఏడాదికి 9,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్నితగ్గించుకొనేటందుకు,
 కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా 2,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేటందుకు,మీటర్ల కొనుగోలులో కమీషన్ కొట్టే టందుకు ప్రభుత్వం మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుందని వివరించారు.

 



వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా పథకం కాంగ్రెస్ పార్టీ మానస పతకమని ,2004 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దీనిని చేర్చడంజరిగిందన్నారు.వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తే విద్యుత్ రంగం సంక్షోభం లో పడుతుందని, కరెంటు తీగల్లో కరెంటు ప్రవహించదని, కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసు  కోవడానికి ఉంటుందని ఆనాడు చంద్రబాబు తదితర టిడిపి నాయకులు ఎగతాళి చేసినప్పటికీ, వ్యవసాయము దండుగ కారాదు పండుగ చేయాలన్న సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే తొలి సంతకం ఆఫైలు మీదనే చేసి 2004 మే 14 నుండి ఈ పథకాన్ని అమలులోకి తెచ్చిందని, ఈ పథకం అమలులోకి వచ్చినప్పటినుండి రైతులు కంటినిండా నిద్రపోతున్నా రన్నారు.అటువంటి రైతు అనుకూల పథకాన్ని రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయం ,వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించడమే కాబట్టి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

 

 

Post Midle


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మోటార్లకు బిగించిన మీటర్లను తొలగిస్తుందని వ్యవసాయ రుణాలను మూడు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తుందని చెప్పారు.జగన్ ప్రభుత్వానికి రాజధాని అంటే అర్థం తెలియదని ఒకటికి, మూడుకి తేడా తెలియదని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్ని మాత్రమే రాజధాని అంటారు అని,అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని, హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రాజధాని అనరు అని, కానీ జగన్ ప్రభుత్వం సచివాలయాన్ని ,అసెంబ్లీని హైకోర్టును కూడా రాజధాని అంటూ ప్రజలను మభ్యపెట్టడం దురదృష్టకరం అన్నారు.దేశంలో 13 రాష్ట్రాలలో రాజధాని వెలుపల హైకోర్టులు ఉన్నాయి. ఈ హైకోర్టు ఉన్న ప్రాంతాలను రాజధాని అనరు. అదే విధంగా మూడు రాష్ట్రాలలో రాజధాని వెలుపల కూడా అసెంబ్లీ భవనాలు ఉన్నాయి. వాటిని రాజధాని  అనరు.  రాష్ట్ర సచివాలయాన్ని రాజధాని ప్రస్తుతం రాష్ట్ర నడిబొడ్డులో ఉన్న అమరావతి లోనే కొనసాగించాలి. విశాఖలో ఏడాదికి ఒక అసెంబ్లీ సెషన్ పెట్టే విధంగా అసెంబ్లీ భవనం నిర్మించాలి  హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసి ,హైకోర్టు బెంచిని అమరావతిలో ఏర్పాటు చేయాలి లేదా అమరావతిలో హైకోర్టును కొనసాగించి బెంచిని కర్నూలులో ఏర్పాటు చేయాలన్నారు.మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, రాష్ట్ర నేత సత్తార్, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, కార్యదర్శి సాదిక్ అలీ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆనంద్ పాల్గొన్నారు.

 

Tags: Free Electricity Scheme Meters for Hoisting Motors

Post Midle