పుంగనూరులో అక్రమార్కుల ఆట కట్టిస్తాం – సీఐ గంగిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్రమ వ్యాపారాలు చేసే వారి ఆటలు కట్టిస్తామని సీఐ గంగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మధ్యం, సారా, ఇసుక రవాణా, హాన్స్, గుట్కా వస్తువులను తరలించడం, విక్రయించడంపై స్పెషల్‌డ్రైవ్ ప్రారంభించామన్నారు. వీటిపై ప్రత్యేక నిఘా ఉంచి అక్రమ వ్యాపారుల ఆట కట్టిస్తామన్నారు. అలాగే గుట్కా, హాన్స్లాంటి నిషేధిత పదార్థాలను విక్రయించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కర్నాటక సరిహద్దు ప్రాంతం కావడంతో చెక్‌పోస్టుల్లో నిఘా తీవ్రతరం చేశామన్నారు. ముఖ్యంగా మధ్యం తాగి వాహనాలను నడిపితే వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. అక్రమ వ్యాపారాలపై పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ మోహన్‌కుమార్ , పోలీసులు పాల్గొన్నారు.

Tags: Free eye clinic at Punganur on 23rd
