పుంగనూరులో 25న ఉచిత కంటి వైద్యశిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘంచే ఈనెల 25న ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు చెంగారెడ్డి, మునస్వామి వెహోదలియార్‌ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ చెన్నైకు చెందిన శంకర్‌నేత్రాలయ వారిచే విశ్రాంత ఉద్యోగుల భవనంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి జబ్బులు కలిగిన వారికి పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లు చేసి, అద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

 

Tags: Free eye clinic on the 25th in Punganur