అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే స్వేచ్ఛా వాయువులు

Free gases are the result of martyrs' sacrifices

Free gases are the result of martyrs' sacrifices

Date:14/08/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌… ప్రజలకు 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సంతోషిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతీయులంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నామని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల త్యాగ నిరతి, దేశభక్తి చిరస్మరణీయమని గుర్తు చేశారు భారతదేశానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని గవర్నర్‌ కొనియాడారు.
స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో ఉన్నత ఆశయాలైన నీతి, నిజాయితీ, అహింసా, శాంతి, సంఘీభావం, సహోదరత్వం, గొప్ప ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కాంక్షించారు. పవిత్ర స్వాతంత్ర్య దినోత్సవం వేళ జాతి నిర్మాణానికి మనందరం కూడా పున:రంకితం కావాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు.
Tags:Free gases are the result of martyrs’ sacrifices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *