గర్భిణీలకు ఉచిత భోజన సదుపాయం
పత్తికొండ ముచ్చట్లు:
పత్తికొండ పట్టణంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రతి నెల 9వ తేదీ గర్భిణీలకు ఉచిత స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. మహిళ గర్భిణీలతో పాటు వారి సహాయకులు కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారు. పోచిమి రెడ్డి సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రతినెల పరీక్షల కొరకు వచ్చే గర్భిణీలకు వారి సహాయకులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 9వ తేదీ గురువారం పోచం రెడ్డి సేవాదళ్ ఆధ్వర్యంలో గర్భిణీలకు వారి సహాయకులకు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సుజాత, హెడ్ నర్స్ విజయలక్ష్మి ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గర్భిణీలు వారి సహాయకులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, పోచిమిరెడ్డి సేవాదళ్ సభ్యులు, పాల్గొన్నారు

Tags Free meal facility for pregnant women
