Natyam ad

తిరుపతి సబ్ జైల్లో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరం

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి సబ్ జైల్లో ఖైదీలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సంకల్ప సేవా సమితి తిరుపతిలోని సబ్ జైల్లో ఉన్న ఖైదీ లకు మరియు సిబ్బందికి ఆదివారం ఉదయం సంకల్ప సేవా సమితి వ్యవస్తాపక అధ్యక్షులు, న్యాయవాది ఎన్. రాజారెడ్డి ఆద్వర్యంలో శ్రీ రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ రమాదేవి సూపర్ స్పె షా లిటీ హాస్పి టల్ అధినేత డా. డి. బి. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ జైల్లో ఉన్న ఖైదీలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని ఆలోచన వచ్చిన సంకల్ప సేవా సమితి అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డికి మొదటిగా ధన్యవాదములు తెలిపారు. ప్రస్తుతం వస్తున్న సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. షుగర్, బీ పీ వ్యాధుల పట్ల నిర్లక్షం గా ఉండరాదని, ఆహారపు ఆల వాట్లు మార్చు కోవాలని, తినే ముందు ప్రతి ఒక్కరు చేతులు శుభ్రం గా కడుగుకోవాలని అన్నారు. పేద ఖైదీ లకు ఉచిత వారి హాస్పి టల్ నందు ఉచితంగా చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు. సంకల్ప సేవా సమితి వ్యవస్తాపక అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ ఖైదీలు సిబ్బంది ఇలాంటి ఉచిత వైద్య సిబిరాలను ఉపయో గించు కోవాలని అన్నారు. కొందరు చేయని తప్పుకు కేసులో ఇరిక్కొని జైల్లల్లో మగ్గుచూ అనేక మంది ఉంటారని వారు సరియైన ఆహారం అందక వివిధ వ్యాధులకు లోనయ్యె ప్రమాదం ఉందని తెలిపారు. జై ల్లో ఉన్న వారందరు నేరం చేసిన అసలైన నిందితులు కాదని నేరారోపణ ఎదుర్కొనే వారు ఎక్కువగా ఉంటారని భావించారు. జై ల్లో ఉన్నామని నిరుత్సాహం చెందక ఉండాలని మీరు బయటకు వచ్చిన తర్వాత సమాజనికి ఉపయోగ పడే పనులను చేయాలని ఉద్బోదించారు. *ఈ కార్యక్రమం లో డా. బీ. కిషోర్, డా. డి. మస్తానమ్మ, న్యాయవాదులు చంద్రయ్య, ఆశ, నరసిం హులు, రేహనా, ఆప్స్ జిల్లా అధ్య క్షులు షేక్ మహ్మద్ రపీ, బాలాజి, పెదరాయుడు మరియు జైల్ సిబ్బంది, హాస్పి టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఖైదీలకందరికి ఉచితంగా షుగర్, బీ పీ పరీక్షలు చేసి అవసర మైన వారికి మందులు ఉచితంగా ఇచ్చారు.

Post Midle

 

Tags: Free medical camp for prisoners in Tirupati Sub Jail

Post Midle

Leave A Reply

Your email address will not be published.