Natyam ad

19న మండల కేంద్రాలలో ధర్నా..

కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం..

 

పేపర్ లీక్స్ పై కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి ఉద్యమం…

 

హైదరాబాద్   ముచ్చట్లు:

 

Post Midle


రాష్ట్రంలో పాలన అద్వాన్నంగా మారిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.. ఉద్యోగాల కోసం ఉమ్మడి రాష్ట్రంలో సరైన న్యాయం జరగడం లేదని దశాబ్దాల పాటు యువత పోరాటం చేశారు. జీవితాలను త్యాగం చేసి ఉద్యమిస్తే తల్లి సోనియమ్మ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తి చేసారు. కానీ కేసీఆర్, కేటీఆర్ పాలనలో తెలంగాణ లో ఉద్యోగ నియామకాలు అపహాస్యంగా పరిణమించాయి.

 

 

 

ఉద్యోగ నియామకాల్లో అడ్డగోలు అవినీతి, డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. తాజాగా టీపీపీఎస్సి టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాల లీక్ ప్రభుత్వ నిర్లక్షానికి పరాకాష్ట.. కేటీఆర్ అవినీతి అడ్డగోలు పాలన, కుటుంబ సభ్యులు ఉద్యోగాలను అమ్ముకుని యువత పొట్టగొట్టి కోట్లు సంపాదిస్తున్నారు.
ఇంటర్ పరీక్ష పాత్రలు లీక్, సింగరేణి పత్రాలు లీక్, ఎస్సి , కానిస్టేబుల్స్ పరీక్షల్లో అవకతవకలు, గ్రూప్ 1 పత్రాలు లీక్ ఇలా ఈ లీక్ ప్రభుత్వంపైన నిరసన వ్యక్తం చేసేందుకు ఈ నెల 19న అన్ని మండల కేంద్రాలలో దర్బాలు, కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలు చేపట్టాలి. కేటీఆర్ రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించాలి. ఈ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టి యువతకు, విద్యార్థి, నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని అయన అన్నారు.

Tags;Free medical camp under Sairam Hospital on 19th

Post Midle