Natyam ad

19న సాయిరాం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 

ఎమ్మిగనూరు

 

ఈనెల 19వ తేదీన ఎమ్మినూరు పట్టణం వీవర్స్ కాలనీలోని సాయిరాం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సాయిరాం హాస్పిటల్ డైరెక్టర్ కె శివన్న పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 19వ తేదీన( ఆదివారం) తాలూకా పరిధిలోని మండల కేంద్రమైన గోనెగండ్ల పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు, శిబిరంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడును అని తెలిపారు. దగ్గు జ్వరం పక్షపాతం మొదలగు అన్ని వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించబడును. వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలతో పాటు, రక్త పరీక్షలు, స్కానింగ్, పరీక్ష అనంతరం ఉచితంగా మందులు ఇవ్వబడును. కావున ఈ సదా అవకాశాన్ని గోనెగండ్ల గ్రామ ప్రజలు, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.

Post Midle

Tags;Free medical camp under Sairam Hospital on 19th

Post Midle