ఉచిత మెగా వైద్య శిబిరం
బుచ్చి నాయుడు కండ్రిగ
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సిపిఐ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య ఆధ్వర్యంలో అమర హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిపి షుగర్ థైరాయిడ్ జ్వరము డెంగ్యూ మలేరియా మరియు గుండె సంబంధిత సమస్యలకు ఎముకలు కీళ్లు వెన్నెముక మొదలగు ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను సరఫరా చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారుగా 250 మందికి పైగా వైద్యం అందించడం జరిగింది. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి మణికంఠ అనే విద్యార్థి తరగతి గదిలో అకస్మాత్తుగా పిట్స్ వచ్చి గుంజుకుంటూ ఉన్న సమయంలో ఉపాధ్యాయులు గమనించి ఈ ఉచిత వైద్య శిబిరానికి తీసుకెళ్లగా డాక్టర్ హర్షిత్ అతనికి ఈసీజీ మరియు బిపి వంటి ఆరోగ్య పరీక్షలను చేసిన తర్వాత అతనికి ఆరోగ్యం కుదుటపడినది. ఉచితంగా మందులను కూడా అందించడం చేయడం జరిగింది. కార్యక్రమంలో డాక్టర్స్ హర్షిత్, దిన తేజ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్, చంద్ర, నర్సులు కావ్య అర్చన తిరీషా సాయి తేజ ల ఆధ్వర్యంలో ఈ ఉచిత క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించారు.

Tags: Free mega medical camp
