పుంగనూరు నుంచి శ్రీవారి దర్శనానికి ఉచిత ఆర్టీసి బస్సు
పుంగనూరు ముచ్చట్లు:
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకునే భక్తులకు సమరత సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ఆర్టీసి బస్సు ఏర్పాటు చేశారు. ఆదివారం ఆయన వనమలదిన్నెలో బస్సుకు జెండాఊపి ప్రారంభించారు. త్రిమూర్తిరెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవాణిట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం కల్పిస్తారని తెలిపారు. 49 మంది భక్తులను ఉచితంగా పుంగనూరు నుంచి పంపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకుని తరించాలని ఆయన కోరారు.

Tags: Free RTC bus from Punganur to Srivari Darshan
