జులై 23న ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల

తిరుమల ముచ్చట్లు:

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జులై 23వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైనది.

 

Tags: Free Special Darshan Quota for Senior Citizens, Disabled Online on July 23

Leave A Reply

Your email address will not be published.