లీకేజీలతో చెరువును తలపిస్తున్న మంచినీటి వైపు లైన్లు
– అధికారులు పట్టించుకోవడం లేదు
– ఫోన్ చేస్తే స్పందించరు
పెద్దపల్లిముచ్చట్లు:

పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఉద్యోగుల తీరు వేరుగా ఉంటుందని మరోసారి నిరుపించుకుంటున్నారు. నీటి సరఫరా విభాగం అధికారి విషయంలో అయితే మరీను. ఫోన్ చేస్తే లేపరు, వాట్సాప్ మెసేజ్ పెడితే స్పందించరు. ఎలా మరి నిత్యం వృధాగా పోతున్న మంచి నీరు, వేసవి కాలం ప్రారంభమయ్యింది. ప్రజలకు ఫిల్టర్ లేకున్నా మంచి నీరు చాలనుకొని వీటినే తాగుతున్న వారు నూటికి తొంబ్బాయి శాతం మంది ఉన్నారు. కొత్త రోగాలు వస్తున్నాయి, పాత కరోనా ఇంకా వెంటాడుతూనే ఉన్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పట్టణ ప్రజలకు మంచి నీటిని అందించాల్సిన భాద్యత మున్సిపల్ నీటి సరఫరా అధికారులు, సిబ్బందిది. సిబ్బంది వారి పని వారు సక్రమంగా చేస్తున్నారు. ఉదయం మూడు నుంచి సాయంత్రం వరకు షిఫ్ట్ వారిగా ఆయా వార్డులకు నీటిని అందిస్తున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సిబ్బంది నీళ్లు వదిలి పెట్టి కూర్చుంటున్నారు. ఇక్కడ కథ నీటి లీకేజి, నీరు సరఫరా అయ్యేంత వరకు లీకేజి అవుతూనే ఉంటుంది. ఒక్క వార్డుకు సుమారు 3 గంటల వరకు నీటిని వదులు తున్నారు. ఒక్క స్థలంలోనే కాకుండా పెద్దపల్లి పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా నీటి లీకేజి దర్శనమిస్తూనే ఉంటున్నది. కొన్ని చోట్ల చిన్న పాటి చెరువులను తలపిస్తున్నాయి. అమర్ నగర్ లో అయితే మూడు చోట్ల లీకేజితో వాటర్ వృధా పోతున్నదని సంబంధిత నీటి సరఫరా అధికారికి రెండు మార్లు ఫోన్ చేస్తే లేపదు. రిప్లై కాల్ రాలేదు. లీకేజి వీడియోలు ఫోటో తీసి పెట్టి వారం గడుస్తున్నా స్పందించ లేదు. ఒక రోజు రెండు రోజులు కాదు నిత్యం ఇదే పరిస్థితి.
అయితే నీటి సరఫరా ఆగిపోతే ఆ నిలిచిన నీరు మళ్ళీ అందులోకే వెళుతున్నది. దింతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వేసవి కాలంలో నీటి కాలుష్యం వల్ల డైయోరియా ప్రభలే అవకాశం ఉన్నది. గతంలో పెద్దపల్లిలో డైయోరియాతో చనిపోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశమైనది. ఓ వైపు స్వచ్చత, శుభ్రత అంటూ అధికారులు తిరుగున్నారు. మురుగు నీటి నిల్వల వల్ల రోగాలు వస్తాయి అంటున్నారు. ఇలా నిల్వ ఉండే నీటి వల్ల రోగాలు రావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం కొద్ది దూరంలో గల ట్రాన్ఫార్మర్ వద్ద నీటి లీకేజి మరీ ఘోరంగా ఉంది. ఈ నీటిలో నుండి నడుచుకుంటూ వెళుతున్న పాద చారులకు విద్యుత్ షాక్ తగిలితే బాధ్యత ఎవరు వహిస్తారు. ప్రాణం విలువ లెక్క కట్టడం తప్ప పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఇంత మొద్దు నిద్రలో ఉన్న సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ లీకేజిల వల్ల నిత్యం కొన్ని వేల నీళ్లు వృధాగా పోతున్నాయి. రోజు ఆ దారుల నుండే అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు వెళుతున్నా ఎందుకు స్పందించడం లేదు. వార్తల కోసం ఫోటోలకు ఫోజులు పెడితే సరిపోదు. ప్రమాదం జరగక ముందే అధికారులు నివారణ చర్యలు, రక్షణ చర్యలు చేపడితే బాగుంటుంది. మున్సిపాలిటీలో నిల్వ ఉన్న మురుగులాగా అధికారులు కూడా అలాగే ఉంటే ఏం చేయాలనేది ఉన్నాతాదికారులదే తుది నిర్ణయం.
Tags;Fresh water lines leading to pond with leaks
