Natyam ad

మొదటి వరుసలో ఫ్రెండ్లీ పోలీస్… ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్

– క్రమశిక్షణకు మారుపేరు ఆయన
– బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్
– కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాలు తు.చ తప్పక ఆచరణలో తొలి అడుగు
– సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు వాటిపై ప్రత్యేక దృష్టి
– ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు
– జిల్లాలో ప్రశాంత వాతావరణంలోపకడ్బందీగా ఎన్నికలు జరిగేందుకు రంగం సిద్ధం
– తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ కే సాధ్యం అంటున్న మేధావి వర్గం ప్రజలు

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

సామాన్యుడికే పెద్ద పీట వేసే మనస్తత్వం ఆయనది. క్రమశిక్షణకు మారుపేరు..తిరుపతి జిల్లా ఎస్పీగా మార్చి 5న బాధ్యతలు చేపట్టిన కృష్ణ కాంత్ పటేల్ మొదటి వరుసలో ఫ్రెండ్లీ పోలీస్ సిద్ధాంతానికి కట్టుబడ్డాడు. 2024లో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాలను తు.చ తప్పకుండా ఆచరించడంలో తొలి అడుగు వేశారు. సామాన్యుడికే పెద్ద పీట వేసే ఎస్పి కృష్ణ కాంత్ పటేల్ ముందుగా ఫ్రెండ్లీ పోలీస్ కి అర్థం చెప్పారు. తిరుపతి జిల్లా ప్రజలనే కాకుండా జిల్లాలోని పోలీస్ అధికారులు, క్రింది స్థాయి పోలీస్ కానిస్టేబుల్ క్యాడర్ సిబ్బంది నుంచి అందరి నుంచి ఆయనకు ప్రశంసలు అందుతున్నాయంటే కృష్ణ కాంత్ పటేల్ ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది. పార్టీలకు అతీతంగా పనిచేసే మనస్తత్వం కలిగిన ఏకైక వ్యక్తి ఆయన.

 

 

 

తిరుపతి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు జరిగేందుకు అందరి అధికారుల సమన్వయంతో ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎప్పటికప్పుడు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా తనిఖీలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేట్ తగ్గిందంటే ఇక ఆయన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో తెలుస్తుంది. ఎన్నికలలో భాగంగా ఇప్పటికే సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తిరుపతి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆయన చేస్తున్న నిరంతర కృషిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. 2018లో ఐపీఎస్ అధికారిగా ఎంపికైన కృష్ణ కాంత్ పటేల్ మొదటగా రొంపచోడవరం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అతిపిమ్మట కర్నూలు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు.

 

 

 

విజయవాడ కమిషనరేట్లో శాంతిభద్రతల డిసిపిగా విధులు నిర్వహిస్తూ బదిలీపై తిరుపతి జిల్లా ఎస్పీగా కృష్ణ కాంత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎక్కడ భంగం కలగకుండా చూడడమే కాకుండా భంగం కలిగించే వారిని కట్టడి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. జిల్లా ప్రజలే కాకుండా పోలీస్ సిబ్బంది కూడా క్రమశిక్షణతో ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మార్చి 8న మహాశివరాత్రి పర్వదినమే. ఆయన సామాన్య భక్తుడికే పెద్దపీట వేస్తూ వారి భద్రత కోసం భక్తులు క్యూ లైన్ లలో పడుతున్న కష్టాలను స్వయంగా పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తోటి పోలీస్ అధికారుల ను క్రింది స్థాయి సిబ్బందిని కలుపుకొని ముందుకు వెళుతున్న వ్యక్తి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్. అలాంటి వ్యక్తి తిరుపతి జిల్లా ఎస్పీగా రావడం జిల్లా ప్రజలు పోలీస్ అధికారులు చేసుకున్న పుణ్య ఫలమేనని జిల్లాలోని ప్రజలు పలువురు మేధావులు రాజకీయ నాయకుల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. పలువురు అభినందనలు ప్రశంసలు. అలాంటి ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిద్దాం.

 

Tags:Friendly Police in the first row… SP Krishna Kant Patel

Post Midle