గన్నవరం నుంచి డబ్బున్నోడిని కాదు దమ్మున్నోడిని నిలబెడతాం
-టీడీపీ నేత చింతమనేని
గన్నవరం ముచ్చట్లు:
గన్నవరం నియోజకవర్గం నుంచి డబ్బున్నోడిని కాదు దమ్మున్నోడిని నిలబెడతామని టిడిపి సీనియర్ నేత చింతమనేని అన్నారు. గన్నవరం నియోజకవర్గం సీటు కోసం ఒక వ్యక్తి 150 కోట్లు కోట్లు ఖర్చు పెడతానంటూ తన దగ్గరికి వచ్చినట్లు అయన అన్నారు. అయితే, గన్నవరం సీటు కోసం 150 కోట్లు ఖర్చు పెడతానని తనను కలిసిన వ్యక్తి పేరు చెప్పలేదు. ఓట్లు ఖర్చుపెట్టే వ్యక్తిని కాదు మీసం మేలేసే దమ్మున్న వ్యక్తిని బరిలోకి దింపుతాం. ఒకరు పోతే 100 మంది వస్తారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి అయన వ్యాఖ్యలు చేసారు.

Tags: From Gannavaram we will stand not with money but with guts
