గనుల యజమానులనుంచి టీడీపీకి మామూళ్లు-మంత్రి కాకాణి

నెల్లూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా  క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం. ఆంధ్ర. పేరుతో క్రీడా పోటీలను  నిర్వహిస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.  క్రీడాకారులను ప్రతిభను గుర్తించి.. వారిలో ఉత్తేజాన్ని కలిగించేందుకు ఇవి దోహదం చేస్తాయి. క్రీడలకు సంబంధించి ఇది ఒక మహా యజ్ఞం లాంటిది. కొందరు ఆడే వాళ్ళు ఉంటారు.. కొందరు క్రీడలను చూసి ఉత్తేజాం పొందే వారు ఉంటారు. ఇంత చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ కల్పించారు. ఐదు క్రీడలను ఆడుదాం.. ఆంధ్ర.. కింద నిర్వహిస్తున్నాం. గ్రామ.. మండల.. నియోజకవర్గ ..జిల్లా. స్థాయిలో ఈ పోటీలు ఉంటాయి. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల ను నిర్వహిస్తాం. ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ  కొనసాగుతాయని అన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలు విచేతలకు ముఖ్యమంత్రి జగన్ బహుమతులు అందజేస్తారు. ఆడుదాం.. ఆంధ్ర.. కోసం గ్రామీణ యువత ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

 

 

ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణకు పనికి వస్తుందే తప్ప… పూర్తి ఫలితాలకు కొలమానం కాదు. కొంత మేర మాత్రమే  అభిప్రాయం వస్తుంది. జిల్లాల్లో తెల్ల రాయి అక్రమ రవాణా పై టిడిపి నేత సోమిరెడ్డి హడావిడి చేస్తున్నారు. అక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పారు. మైన్ యజమానులు కలసిన తరువాత దాని గురించి మాట్లాడటం లేదు. గనుల యజమానుల నుంచి మామూళ్లు తీసుకున్నారు. 14 మందికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరితో ఒప్పందం కుదరడంతో  ఇప్పుడు సిలికా పై పడ్డారు. ఈ విషయం పై తిరుపతి కలెక్టర్ ను కూడా కలిశారు. అక్కడా ఒప్పందం కుదిరిందేమో..అందుకే ఆ విషయాన్ని కూడా మళ్లీ మాట్లాడటం లేదు. కిరాయికి రాజకీయాలు చేస్తున్నారు. బెదిరింపులు..బ్లాక్ మెయిల్ లు ఆయనకు అలవాటే నని విమర్శించారు.

 

Tags: From Mine Owners to TDP – Minister Kakani

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *