Natyam ad

స్కూల్ టీచర్ నుంచి లాబీయింగ్ వరకు…

తిరుపతి ముచ్చట్లు:


మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారంటూ రేగిన వివాదం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అందించిన సమాచారం మేరకు.. మొయినాబాద్ లోని ఓ ఫాంహౌజ్ లో బుధవారం రాత్రి వేళ సైబరాబాద్ పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ బండారం బయటపడింది. బీజేపీ ఆదేశాలతో రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కాషాయ కండువా కప్పుకొనేలా ప్రయత్నిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే, పట్టుబడ్డ ముగ్గురు నిందితుల్లో సింహయాజి నేపథ్యం మాత్రం కాస్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఎమ్మెల్యేల ప్రలోభాల వివాదంలో పట్టుబడిన సింహయాజి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన అసలు పేరు అశోక్. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం రామనాథపురం గ్రామానికి చెందిన ఈయన.. 20 సంవత్సరాల క్రితం సొంత ఊర్లోనే ఓ చిన్నపాటి ప్రైవేటు స్కూలు నడిపేవారు. అందులో నష్టాలు రావడంతో స్కూలు ఎత్తేసి, మరో ప్రైవేటు స్కూలులో టీచర్ గా పని చేశారు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్వామీజీ అవతారం ఎత్తారు. రామనాథపురంలో శ్రీమంత్ర రాజపీఠం ఏర్పాటు చేశారు. దానికి తాను పీఠాధిపతిగా స్వయంగా ప్రకటించుకొని కొనసాగుతున్నారు.ఈ గ్రామంలోనే నరసింహ స్వామి ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి 10 ఏళ్ల కిందట ప్రయత్నం చేసిన వ్యవహారం బెడిసి కొట్టింది. ఆ ప్రాంతంలో ఎవరూ ఆయన్ని స్వామీజీగా విశ్వసించకపోవడంతో తిరుపతికి మకాం మార్చారు. 15 ఏళ్లుగా అక్కడే ఓ పీఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకు ఓసారి స్వగ్రామం రామనాథపురానికి వచ్చి వెళ్తుంటారని ఆ ఊరి వారు చెప్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మునుగోడు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వివాదంలో చిక్కుకున్నారు.

 

 

 

మొత్తం ముగ్గురిలో ఈయన కూడా ఉండడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో సింహయాజి స్వామీజీ, నందు, సతీష్ లపై కేసు నమోదైంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998 సెక్షన్ కింద కేసు పెట్టారు. బీజేపీలో చేరేందుకు 100 కోట్ల రూపాయల ఆఫర్… ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల రూపాయల ఆఫర్ ఇస్తామని ప్రలోభపెట్టినట్లు పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ నిందితుల్లో ఒకరైన నందకుమార్ హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఉంటారని తెలుస్తోంది. ఈయన గతంలో అంబర్ పేట శివం రోడ్డులో హోటల్ ప్రారంభించారు. క్యాటరింగ్ రంగంలోకి దిగి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, ధనవంతులకు క్యాటరింగ్ చేస్తుండేవారు.మరోవైపు, పట్టుబడ్డ ఈ ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, నందకుమార్, సింహయాజి స్వామి ముగ్గురూ గతంలో బీజేపీ అగ్ర నేతలతో కలిసి ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రామచంద్ర భారతి గతంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారింది. కిషన్ రెడ్డితో నందకుమార్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సింహయాజి, కిషన్ రెడ్డిని సింహయాజి దీవిస్తున్నట్లు ఉన్న ఫోటోలను కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.

 

Post Midle

Tags: From school teacher to lobbying…

Post Midle

Leave A Reply

Your email address will not be published.