తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి అమ్మవారికి సారె 

From Thirumala Srivari Temple to Sripadmavati Amma

From Thirumala Srivari Temple to Sripadmavati Amma

Date:19/11/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన డిసెంబ‌రు 1న‌ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించ‌డం జ‌రుగుతుంది. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా డిసెంబ‌రు 1న ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె గజాలపై ఊరేగింపుగా మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంకు చేరుకుంటుంది. తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్దకు చేరుకున్న సారెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  అక్కడినుంచి భజనలు, కోలాటాలు తదితర కళాబృందాల నడుమ కోమలమ్మ సత్రం (ఆర్‌ఎస్‌గార్డెన్‌), తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి ఉద‌యం 9.00 గంట‌ల‌కు సారె చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు, అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి  పుష్కరిణి వద్దకు సారెను తీసుకువెళ్ల‌తారు.

 

 

 

నవంబరు 27న శ్రీవారి లక్మీకాసుల హారం ఊరేగింపు

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా న‌వంబ‌రు 27వ తేదీ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం  ఊరేగింపు  జరుగనుంది.  శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారం ఉద‌యం 8.00 నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగించ‌నున్నారు. అనంత‌రం ఈ హారంను అధికారులు ఉదయం 9 గంటలకు తిరుమలలో బయల్దేరి, తిరుచానూరులోని పసుపు మండపానికి  తీసుకొస్తారు. అనంతరం ప‌సుపు మండ‌పం నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు. న‌వంబ‌రు 27వ తేదీ సాయంత్రం జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజవాహన సేవ రోజు అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

 

20 నుంచి వైఎస్సార్‌ నవశకం సర్వే

 

Tags:From Thirumala Srivari Temple to Sripadmavati Amma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *