Date:30/11/2020
సంగారెడ్డి ముచ్చట్లు
భారతీయ జనతా పార్టీ నాయకుల్లో రోజురోజుకు ఫ్రాస్టేషన్ పెరుగుతోంది. ఈరోజు పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకుల ధర్నా ఒక డ్రామా అని మంత్రి హరీష్ రావు అన్నారు. పీఎం, అమిత్ షా తో సహా ఢిల్లీ నేతలను తెచ్చి ప్రచారం చేయించిన ఫలితం లేకపోవడం తో వారిలో ఫ్రస్టేషన్ పెరిగిపోతుందని అయన అన్నారు. శనివారం అయన పటాన్ చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు బీజేపీ నేతలను నమ్మక పోవడం తో సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారు. ఫేక్ వార్తల ప్రచారం లో నోబెల్ బహుమతి ఉంటే ఆ నోబెల్ బహుమతి బీజేపీ పార్టీ కి వస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఎన్నికల రోజున టీవీ9 లోగో వాడుకుని ఫేక్ ప్రచారం చేసి లబ్ది పొందాలని చూసారు. రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ప్రధాన చాన్నాళ్ల లోగో లు వాడుకుని టీఆరెస్ ప్రముఖ నేతలు బీజేపీ లో చేరుతారని ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. దయచేసి ప్రజాలేవరూ అలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దు…ఎవ్వరూ సర్క్యులేట్ చేయవద్దు. సోషల్ మీడియా ను పూర్తి స్థాయి ఫేక్ మీడియా గా బీజేపీ మార్చివేసింది. బలమైన సోషల్ మీడియా స్థాయిని దిగజార్చిందని అన్నారు,.
ఎంత మంది నేతలు వచ్చి ప్రచారం చేసిన హైదరాబాద్ నగర ప్రజలు నమ్మట్లేదని అర్థమయ్యి ఫేక్ వార్తలు ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురిచేసేవిధంగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం ఉందని అయన అన్నారు. నాతో సహా ఇతర ముఖ్య నేతల పై తప్పుడు వార్తలు సోషల్ మీడియా లో సర్క్యులేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రజాలేవరూ ఆ వార్తలను నమ్మొద్దు. టీఆరెస్ కార్యకర్తలేవరూ సంయమనం కోల్పోవద్దని మంత్రి అన్నారు.
పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా
Tags:Frostiness among BJP leaders