పేర్ని నానికి ఫ్రస్టేషన్

విజయవాడ ముచ్చట్లు:

పేర్ని నాని.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ఏమో కానీ.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన తొలి కేబినెట్‌లో మంత్రిగా ఈ పేర్ని నాని గారి హావా కొట్టొచ్చనట్లు కనబడేదని.. ఫ్యాన్ పార్టీలోని నాయకులు ఏమో కానీ.. సినీ పెద్దలు మాత్రం టాలీవుడ్ సాక్షిగా గట్టిగానే చెప్పుకొనేవారు. అయితే పేర్ని నాని తాజాగా మాజీ మంత్రిగా మారారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ట్రేటషన్ పీక్స్ వెళ్లిపోయిందనే ఓ టాక్ అయితే బందరు నియోజకవర్గంలో జోరుగా సర్క్యులేట్ అవుతోంది. మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఈ మాజీ మంత్రిగారిని తాజాగా నగర ప్రజలు అంతాగా లెక్క చేయడం లేదట. ఈయన గారు నగర వీధుల్లోకి వస్తే.. జనం లైట్‌గా తీసుకుని చూసి చూడనట్లు పక్క నుంచి వెళ్లిపోతున్నారట. అంతేకాదు.. ఇటీవల కేంద్ర మంత్రి పోర్టు అంశంపై.. బందరు వస్తే.. రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజుతో ఆయన మాట్లాడుతుండగా.. ఈ మాజీ మంత్రిగారు.. అల్లంత దూరంలో ఉండిపోయిన ఓ చిత్ర రాజం ఇటీవల సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. మరోవైపు.. బందరు నగరంలో జనసమర్దంగా ఉండే ఓ ప్రాంతంలో ఇటీవల ఓ షాపును.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు.  కానీ ఈ కార్యక్రమానికీ ఈ తాజాగా మాజీ అయిన మంత్రిగారిని పిలవలేదట. దీంతో ఈ మాజీ అమాత్యుల వారికి కోపం నషాళానికి అంటిందట. అంతే.. ఈ మాజీ సార్ వాడు.. వెంటనే రంగంలోకి దిగి.. సదరు కూడలిలో బారికెడ్లు పెట్టించారట. దీంతో సెంటర్‌లో ఈ బారికెడ్లు ఎందుకు రోడ్డుకు అడ్డంగా ప్రత్యక్షం అయినాయో.. అర్థం కాక.. సదరు నగర వాసులు అయోమయం జగన్నాథం స్థితిలోకి సర్రున జారిపోయారట. అసలు ఏం జరిగిందంటూ అక్కడి వారిని జనం ఆరా తీయగా.. ఇదంతా మాజీ మంత్రివర్యులు గారి తాజా తాజా పెతాపం అంటూ గుసగుసలు మొదలైనాయట. జగన్ కేబినెట్‌లో పేర్ని నాని…  రవాణా, సినీమాటోగ్రఫీ, సమాచారం పౌర సంబంధాలు శాఖల మంత్రిగా పని చేసినా.. సినీమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ధగధగా వెలిగిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే గతంలో మంత్రిగా పేర్ని నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా..

 

 

Post Midle

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై ఓ రెంజ్‌లో చెలరేగిపోయేవారన్న సంగతి అందరికీ తెలిసిందే. మరో వైపు జగన్ కేబినెట్‌ నుంచి తప్పుకుని మాజీ మంత్రులు అయిన కొడాలి నాని, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, అవంతి తదితరులంతా ముక్కున వేలేసుకుని స్కూల్ స్టూడెంట్‌లా సైలెంట్ అయిపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఈ పేర్ని నాని మాత్రం ఇంకా మంత్రిగానే కొనసాగుతున్నట్లు వ్యవహరిస్తున్నారని ఓ టాక్ అయితే నియోజకవర్గ ప్రజలు బలంగా ఉంది. తాజాగా మాజీలు అయిన మంత్రులు కొడాలి, కన్నబాబు, అవంతి, అనిల్ కుమార్ యాదవులు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. కానీ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. మంత్రిగారి హోదాలో మాట్లాడినట్లు మాట్లాడడం. జనానికి అంతగా రుచించడం లేదట. మరోవైపు వంగవీటి రాధ, కొడాలి నానిలు మంచి దోస్తులే. కానీ వంగవీటి రాధకు పేర్ని నానికి మద్య గ్యాప్ ఉందని సమాచారం. ఆ క్రమంలోనే వంగవీటి రాధ.. తన నియోజకవర్గంలోకి వచ్చి.. షాపు ఒపెనింగ్ చేసి వెళ్లిపోవడాన్ని ఈ మాజీ మంత్రి వర్యులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఏదీ ఏమైనా మాజీలు అయిన సహచరులంతా చాలా కామ్‌గా ఉంటే.. ఈ పేర్ని నాని మాత్రం ఇలా రగిలిపోవడం ఎందుకు అని ప్రశ్న బందరులోని  ఫ్యాన్ పార్టీ నేతల్లోని ఓ వర్గంలో ఉత్పన్నమైందట. అదీ ప్రస్ట్రేషనా లేక మళ్లీ మంత్రి పదవి కోసమేనా? అనే సందిగ్థంలోకి ఆయన అనుచరులంతా లట్టుక్కున జారీపోయారట.

 

Tags: Frustration to the name nani

Post Midle
Natyam ad