నిమ్మగడ్డ వ్యవహారంపై రచ్చ

Date:05/05/2020

విజయవాడ ముచ్చట్లు:

నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారన్న సీఐడీ చెబుతోంది. దీనికి సంబంధించి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్ర కోణంలో లేఖ అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నామన్నారు.ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖ విషయంలో సీఐడీకి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రాసిన లేఖ ఎస్‌ఈసీ ఆఫీస్‌లో తయారు కాలేదని రిపోర్ట్‌లో తేలినట్లు సమాచారం. లాప్‌ట్యాప్, డెస్క్‌టాప్‌లను పరిశీలించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. అలాగే నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారన్న సీఐడీ చెబుతోంది. దీనికి సంబంధించి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తి చెప్పినవన్నీ అబద్దాలన్నారు సీఐడీ చీఫ్ సునీల్. 18వ తేదీ ఉదయం పెన్‌డ్రైవ్‌లో లేఖ వచ్చిందని.. లెటర్ ముందే తయారు చేసి తీసుకొచ్చారన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా నివేదిక ఉందని.. ఫైల్ కార్యాలయంలో తయారైందని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తేలుస్తామని.. రహస్య లేఖ అయితే బయటకెలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. కుట్ర కోణంలో లేఖ అనేదానిపై కూడా విచారణ జరుపుతున్నాం అన్నారు.

 

 

 

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కేంద్రానికి రాసిన లేఖపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. సీఐడీ కూడా రంగంలోకి దిగి లేఖ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తిని ప్రశ్నించింది. అలాగే రమేష్‌కుమార్‌ను కూడా విచారించినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడం ఆసక్తికరంగా మారింది. సీఐడీ ఈ అంశంపై ఎలా ముందుకు వెళుతుందన్నది ఉత్కంఠరేపుతోంది.

28 వరకు లాక్ డౌన్..?

Tags: Fucking lemonade affair

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *