రికార్డు స్థాయికి పెరిగిన ఇంధన ధరలు

-రూ.102 దాటేసింది!

-పెట్రోలుపై లీటరుకు 28 ​​పైసలు

-డీజిల్‌పై 27 పైసలు మేర పెంపు

 

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

ఒక రోజుగా గ్యాప్‌ తరువాత వరుసగా శుక్రవారం, నేడు(శనివారం) రెండు రోజూ ఇంధన ధరలు ఊపందుకున్నాయి. దేశవ్యాప్తంగా చాలా న‌గ‌రాల్లో ఇప్ప‌టికే పెట్రో ధ‌ర రూ.100 మార్క్‌ను దాటేసింది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది . ఈ పెంపుతో వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 102 మార్క్‌ను దాటగా, విజయవాడలో సుమారు 102 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని నగరంలో పెట్రోల్‌ రూ.96.12, డీజిల్‌ రూ.86.98 గా ఉంది. ఈ నెలలో 12 రోజుల కాలంలో ఇప్పటివరకు ఏడు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 24 సార్లు చమురు ధరలు పెరిగాయి.

 

 

 

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోలు, డిజల్ ధ‌ర‌లు లీటరుకు
ఢిల్లీలో పెట్రోల్‌ రూ.96.12, డీజిల్‌ రూ.86.98
ముంబైలో పెట్రోల్‌ రూ.102.30, డీజిల్‌ రూ.94.39

చెన్నైలో పెట్రోల్‌ రూ.97.43, డీజిల్‌ రూ. 91.64

కోల్‌కతాలో రూ.96.06 డీజిల్‌ రూ.89.83

 

 

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.99.90, డీజిల్‌ రూ.94.82

విజయవాడలో పెట్రోల్‌ రూ.101.88, డీజిల్‌ రూ.96.23

వైజాగ్‌లో పెట్రోల్‌ రూ.101.05, డీజిల్‌ రూ.95.41

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Fuel prices soared to record levels

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *