జర్నలిస్టుల సమస్యలను నెరవేర్చండి

-పెన్ జాప్ స్టేట్ సెక్రెటరీ చంద్రశేఖరరెడ్డి

కర్నూలు ముచ్చట్లు :

 

జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పెన్ జాప్ జర్నలిస్టు అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ చంద్రశేఖరరెడ్డి కోరారు.అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్స్ జారీ చెయ్యాలి. చిన్న పత్రికలు, పీరియాడికల్స్ ఎడిటర్స్, రిపోర్టర్లకు వన్ థర్డ్ బస్ పాస్ తో కూడిన  స్టేట్ అక్రిడిటేషన్ ఇవ్వాలి. చిన్న పత్రికలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని. చిన్న పత్రికలు, పీరియాడికల్స్ కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి. అక్రిడిటేషన్ తో నిమిత్తం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇల్లు, మూడు సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని, వర్కింగ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని తెలిపారు. జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, జర్నలిస్ట్ మరణిస్తే అతని కుటుంబానికి 10 లక్షల రూపాయలతో పాటు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఐదేళ్ల పాటు ఇచ్చి ఆదుకోవాలన్నారు. 55 ఏళ్లు వయసు దాటిన సీనియర్ జర్నలిస్టులకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఫించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు, అర్చకులు, ఫాస్టర్లు, ఇమామ్ లకు ప్రభుత్వం చెల్లిస్తున్న మాదిరిగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ నెలకు10 వేలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న రిపోర్టర్లకు నెలకు 15 వేల రూపాయలు చొప్పున కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న రిపోర్టర్లు, ఫోటో, వీడియో జర్నలిస్టులకు వేజ్ బోర్డు అమలు జరిపేలా చర్యలు చేపట్టాలి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Fulfill the problems of journalists

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *