మూడు రోజుల ముందే టిక్కెట్లు ఫుల్

Full of tickets three days earlier

Full of tickets three days earlier

Date:26/11/2018
చెన్నై ముచ్చట్లు:
రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘రోబో’ సీక్వెల్ ‘2.0’పై భారీ అంచనాలున్నాయి. తెలుగు, తమిళం, హిందీతో పాటు దాదాపు 10కి పైగా భాషల్లో అనువాదమై ఈనెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దాదాపు రూ.540 కోట్లతో తెరకెక్కిన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ 3డిలోనూ వస్తుండటంతో సినీ అభిమానులు అమితాసక్తి చూపిస్తున్నారు. అందుకే విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నా అప్పుడే తొలిరోజు టిక్కెట్లు దాదాపు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించనున్న ‘2.0’ 3డి వర్షన్‌కు సంబంధించిన థియేటర్లన్నీ నిండిపోయాయి. ఇక 2డి వర్షన్‌కు సంబంధించి మల్టీప్లెక్సులు, ప్రధాన థియేటర్లలో టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. నగర శివార్లలోని థియేటర్లు, పాత థియేటర్లలో అక్కడక్కడా టిక్కెట్లు ఉన్నాయి. ఇవి కూడా ఈరోజు, రేపుల్లో అమ్ముడుపోవడం ఖాయం. ఇక చెన్నైలో అన్ని థియేటర్లు నిండిపోయినట్లు సమాచారం. వాస్తవానికి తమిళనాడులో అడ్వాన్స్ బుకింగుల ద్వారానే సుమారు రూ.100 కోట్లు వసూలయ్యాయని అంటున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ‘2.0’ విడుదలకు ముందే సుమారు రూ.490 కోట్ల బిజినెస్ చేసిందని కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల థియేటర్లలో విడుదలవుతోన్న ‘2.0’.. విడుదలకు ముందే ‘బాహుబలి 2’ రికార్డును చెరిపేసింది. గతంలో ‘బాహుబలి 2’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9వేల థియేటర్లలో విడుదలైంది. అలాగే దేశంలోనూ ‘బాహుబలి 2’ సుమారు 6,500 థియేటర్లలో విడుదల కాగా.. ఇప్పుడు ‘2.0’ దాదాపు 6,800 థియేటర్లలో విడుదలవుతోంది. థియేటర్ల సంఖ్యలో ‘బాహుబలి 2’ను అధిగమించిన ఈ సినిమా.. రేపు కెలక్షన్ల విషయంలోనూ రికార్డులు తిరగరాస్తుందో లేదో చూడాలి!
Tags:Full of tickets three days earlier

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *