Natyam ad

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు

పుంగనూరు ముచ్చట్లు:

మా నమ్మకం నువ్వే జగన్‌…మా భవిష్యత్తు జగనన్నే కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని , ప్రజలు ముఖ్యమంత్రి పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మద్దతు ఇస్తున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం మాజీ ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ ఇన్‌చార్జ్ రాజశేఖర్‌రెడ్డితో కలసి సింగిరిగుంట, అరవపల్లె, గోపిశెట్టిపల్లె గ్రామాల్లో ఇంటింటా పర్యటించారు. అలాగే మున్సిపాలిటిలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కొండవీటి కాంతమ్మ, అర్షద్‌అలి, కిజర్‌ఖాన్‌, సాజిదాబేగం, రెడ్డెమ్మ, ఆదిలక్ష్మీ, నూర్జహాన్‌, త్యాగరాజు, భారతి, జయభారతి, జెపి.యాదవ్‌, నరసింహులు, మమత లు వారి వారి వార్డులలో కరపత్రాలు పంపిణీ చేసి , స్టిక్కర్లు అంటించారు. నాలుగు ప్రశ్నలకు సమాధానాలు సేకరించి , ముఖ్యమంత్రి సెల్‌కు మిస్‌డ్‌కాల్‌ ఇచ్చారు.

Post Midle

Tags: Full support for Chief Minister Jaganmohan Reddy

Post Midle