ప్రాణం తీసిన పిల్లల సరదా ఆటలు

Fun games for surviving children

-విద్యార్థి మృతి
– విషాదంలో తల్లిదండ్రులు

Date:19/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఒకటోవ తరగతి చదువుతున్న విద్యార్థులు సరదాగా ఆడుకుంటు మరో విద్యార్థిని బాత్‌రూములో గడియపెట్టి మరచిపోవడంతో ఆ విద్యార్థి భయంతో ఏడుస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన సంఘటన ఈస్ట్పేట మున్సిపల్‌స్కూల్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని రెడ్డెప్ప, నందిని దంపతుల కుమారుడు హర్షవర్ధన్‌(6) పాఠశాలలో ఒకటోతరగతి చదువుతున్నాడు. ఇలా ఉండగా ఈనెల 14న పిల్లలు సరదాగా ఆడుకుంటు హర్షవర్ధన్‌ను బాత్‌రూములో పెట్టి గడియ పెట్టి క్లాసుకు వచ్చేశారు. విద్యార్థి ఎడుపులు విన్న మహిళలు విద్యార్థిని బయటకు తీసుకొచ్చి , టీచర్‌ భారతికి అప్పగించారు. అప్పటి నుంచి తీవ్రమైన భయంతో జ్వరం రావడంతో ప్రతి రోజు ఆసుపత్రిలో చికిత్సలు చేయించారు. సోమవారం తీవ్రమైన జ్వరం రావడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో హర్షవర్ధన్‌ మృతి చెందాడు. దీనిపై తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆందోళన చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే కమిషనర్‌ కెఎల్‌.వర్మ , ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ మేరకు బంధువులతో చర్చలు జరిపారు. ఈ సంఘటనపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన టీచర్‌ భారతికి మెమో జారీ చేశారు. విద్యావలంటీర్‌ పావని ఎందుకు తొలగించకూడదంటు మెమో జారీచేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండ కఠిన చర్యలు చేపడుతామని కమిషనర్‌ తెలిపారు. దీని పై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

గాలి,వానకు విరిగిపడ్డ కొమ్మలు

Tags: Fun games for surviving children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *