Natyam ad

 క్రీడారంగానికి నిధులు

పిఠాపురం ముచ్చట్లు:


క్రీడా రంగానికి,క్రీడాకారుల మౌళిక సదుపాయాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు.ఈనెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని  పిఠాపురం వైసీపీ యువజన విభాగం నాయకులు  పాలిక ప్రవీణ్ కుమార్  ఆధ్వర్యంలో ఈ నెల 19,20,21 తేదీల్లో పిఠాపురం పట్టణంలో రాష్ట్రస్థాయి షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.ఈ టోర్నమెంటుకు సంబంధించిన గోడపత్రికలను,ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన చేతులమీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తోలేటి శ్రీనివాస్,మాగాపు బుజ్జి,శివప్రసాద్,కండేపల్లి శ్రీను,కండేపల్లి సత్య,వైసీపీ నాయకులు బొజ్జా దొరబాబు,రెడ్డెం జనార్దన్,వీరంరెడ్డి చక్రి,బాలిపల్లి రాంబాబు,గుండ్ర జగ్గారావు,కొట్టేటి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Funding for sports

Post Midle
Post Midle