బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు

తుగ్గలి ముచ్చట్లు:

తుగ్గలి మండల పరిధిలోని బొందిమడుగుల చెరువు కట్ట సమీపంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నిధులు మంజూరు చేసారు.గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు బొందిమడుగుల చెరువు కట్ట సమీపంలో బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అయ్యింది.ప్రజల సమస్యల పరిష్కారం కొరకు బ్రిడ్జి నిర్మాణానికి పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి 30 లక్షల రూపాయల నిధులను విడుదల చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఎమ్మెల్యే ఆదేశాలతో శనివారం రోజున తెగిపోయిన బ్రిడ్జి ను ఏ.ఈ మరియు డి.ఈ లు పరిశీలించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Funding for the construction of the bridge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *