Date:16/01/2021
పరవాడ ముచ్చట్లు:
పరవాడ మండలం శనివారం ముత్యాలమ్మ పాలెం గ్రామం లో అయోధ్య రామాలయ నిర్మాణానికి నిది సమర్పణ కోసం ఇంటింటికీ వెళ్ళడం జరిగింది అన్నారు. ఈకార్యక్రమంలో బి యమ్ ఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు యమ్ జగదీష్ మాట్లాడుతూ భారత్ దేశానికి కేంద్ర బిందువుగా అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రతీ కుటుంబం నుంచి తనవంతు భాగంగా మనస్సు పూర్తిగా సమర్పణ చేయాలని చెప్పడం జరిగింది. ప్రతీ వ్యక్తి శక్తికోలది అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చాను అని ఆనందంగా చెప్పుకోవచ్చు అనే భావన ప్రతీ వ్యక్తి కుటుంబం నుంచి రావాలని కోరుకుందాం అని చెప్పడం జరిగింది. ఈకార్యక్రమంలో బి యమ్ ఎస్ అధ్యక్షుడు వాసుపల్లి సోమశేఖర్, సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ వెన్నల అప్పలనాయుడు, ఆర్ ఎస్ ఎస్ సభ్యులు, సూరాడ రాజేంద్ర, బొంది మహేష్,ఆర్జిల్లి రవి,వాసుపల్లి పుష్య మిత్ర,అర్జిల్లి నూకరాజు,సూరాడ అమర్,అర్జిల్లి మహేష్,కోవిరి తాతారావు,అర్జిల్లి రమణ,సూరాడ బంగార్రాజు,సూరాడ మహేష్ గ్రామం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు
Tags: Fundraising for the construction of Ramalaya in Ayodhya