పుంగనూరు ఎస్బిఐ ఖాతాదారుల సేవా సంఘంలో నిధులు గోల్మాల్
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని ఎస్బిఐ ఖాతాదారుల సేవా కేంద్రంలో మహిళా సమాఖ్యల పొదుపు నిధులు స్వాహా చేశారని మండల ఐకెపి ఏపీఎం రవి బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం రవి మాట్లాడుతూ మండలానికి చెందిన రాంపల్లె, కుమ్మరనత్తం గ్రామాలలోని మహిళలు పొదుపు చేస్తున్నారని తెలిపారు. ఇలా ఉండగా నిర్వాహకులు సర్వర్ పనిచేయడం లేదని, మహిళలకు నగదు తీసుకున్న రశీదు అందజేసి వాటిని ఖాతాల్లో జమచేయలేదని, అడగడంతో సక్రమంగా స్పందించకపోవడం, నిధులు జమకాకపోవడంతో ఈనెల 25న మేనేజర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. విచారణలో పూర్తి వాస్తవాలు వెల్లడికావాల్సి ఉందని తెలిపారు.

Tags; Funds are Golmaal in Punganur SBI Customer Service Association
