నిధులు సరే..ఆచరణ ఎక్కడా..

మెదక్    ముచ్చట్లు:
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. లింకు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్లు, నూతన పాఠశాల భవనాలు.. ఇలా అన్ని సదుపాయాలు గజ్వేల్ నియోజకవర్గం సొంతం. అయితే, గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు 2014లో గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా చేపట్టే పనులకు ఇప్పటి వరకు రూ.431 కోట్ల నిధులు మంజూరు చేశారు. కాగా ఆ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ఆర్టీఐ ద్వారా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాబట్టింది.అయితే, ఇన్ని వందల కోట్లు కేవలం ఓ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించడాన్ని స్వాగతించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ.. ఇంకా రాష్ట్రంలోని అభివృద్ధికి నోచుకోని ఎన్నో అసెంబ్లీ నియోజకవర్గాలను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కొమురం భీమ్, ఆసీఫాబాద్ జిల్లా దేశంలోనే రెండవ వెనుకబడిన జిల్లా అని నీతి ఆయోగ్ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, డోర్నకల్, ఇల్లందు వంటి జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని స్వచ్ఛంద సంస్థ ప్రకటనలో తెలిపింది.సీఎం కేసీఆర్ కేవలం గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి పెట్టడంతో పైన తెలిపిన నియోజకవర్గ ప్రాంతాల్లోని గ్రామాలకు రహదారులు, విద్య, వైద్య సౌకర్యాలు, తాగునీటి వసతులు లేక ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధిచెందే విధంగా ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఇప్పటికైనా వెనుకబడిన నియోజకవర్గాల్లోనూ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Funds are OK..practice is nowhere ..

Leave A Reply

Your email address will not be published.